DEVOTEES CROWD AT YADADRI TEMPLE: యాదాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తున్నారు. వరుస సెలవులు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడానికి తరలివస్తున్నారు. పెరిగిన రద్దీతో స్వామివారి ధర్మ దర్శనానికి మూడు గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.
యాదాద్రిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. ధర్మ దర్శనానికి 3 గంటల సమయం..
DEVOTEES CROWD AT YADADRI TEMPLE: యాదాద్రిలో భక్తుల రద్ధీ కొనసాగుతోంది. వరుస సెలవులు కావటంతో వివిధ ప్రాంతాల నుంచి మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో వస్తున్నారు.పెరిగిన రద్దీతో స్వామివారి ధర్మ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. మరోవైపు ఆలయంలో సౌకర్యాలు సరిగ్గా లేక భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. కౌంటర్ వద్ద, క్యూలైన్ల వద్ద కిక్కిరిసిన భక్తులతో తోపులాట, స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి.
yadadri
ఇదిలా ఉండగా.. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులను కొండపై సమస్యలు వెంటాడుతున్నాయి. కౌంటర్ వద్ద సరైన విధానం లేకపోవడం, ప్రత్యేక ప్రవేశ దర్శనం.. క్యూ లైన్ వద్ద కిక్కిరిసిన భక్తులతో తోపులాట, స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. దీనికితోడు కొండపైకి వెళ్లే బస్సులు సరిపడకపోవడంతో పరిమితికి మించి ప్రయాణికులతో కొండపైకి తీసుకెళ్తున్నారంటూ భక్తులు మండిపడుతున్నారు.
ఇవీ చదవండి:
Last Updated : Oct 8, 2022, 7:55 PM IST