తెలంగాణ

telangana

ETV Bharat / state

మిర్యాలగూడ జోరుగా.. చేపల గిరాకి!

మృగశిర కార్తె సందర్భంగా రాష్ట్రంలో పలు చోట్ల చేపల విక్రయాలు జోరుగా సాగాయి. చేపల మార్కెట్లన్నీ జనాలతో కిటకిటలాడాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మార్కెట్​కు మాంసాహార ప్రియులు పోటెత్తారు. ఈరోజు చేపలు తింటే ఏడాదంతా ఎలాంటి రోగాలు రావన్న నమ్మకంతో వాటిని కొనేందుకు జనాలు పోటీ పడ్డారు.

Crowd At Fish Market I n Miryalaguda
మిర్యాలగూడ జోరుగా..చేపల గిరాకి!

By

Published : Jun 8, 2020, 2:32 PM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడ చేపల మార్కెట్​ కొనుగోలుదారులతో కిటకిటలాడింది. మృగశిర కార్తె సందర్భంగా జనాలు చేపలు కొనడానికి పోటీ పడ్డారు. డిమాండ్​ ఎక్కువగా ఉండటం వల్ల చేపల వ్యాపారులు ధరలు పెంచి అమ్మారు. ఒక్కోరకం చేపకు ఒక్కో ధర నిర్ణయించి అమ్మకాలు సాగించారు. రోహిణి కార్తెలో ఎండలతో అల్లాడిపోయిన జనం.. మృగశిర కార్తె రాకతో వాతావరణం చల్లబడుతుందని ఆశిస్తున్నారు. చల్లబడిన వాతావరణంలో శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గకుండా చేపలు తింటారు. మృగశిర కార్తె తొలిరోజే చేపలు తింటే.. ఒంట్లో వేడి పెరిగి ఏడాదంతా ఆరోగ్యంగా ఉంచారని నమ్మకం.

మార్కెట్లో డిమాండ్​ను గమనించిన వ్యాపారులు బొచ్చె, రవ్వ పరం రూ.200 నుంచి 250 వరకు ధరలు పెంచి అమ్మారు. కొర్రమీను అయితే.. ఏకంగా రూ. 400 నుంచి 700 పెంచి అమ్మారు. ధరలు పెంచినా.. మాంసప్రియులు లెక్కచేయకుండా కొనడం కనిపించింది. మృగశిర కార్తె నాడు చేపలే కాకుండా బెల్లం, ఇంగువ కలిపి తింటారు. ఇలా తింటే ఉబ్బసం రాదని నమ్ముతారు.

ఇదీ చూడండి:80 రోజుల తర్వాత పెట్రోల్ ధరలు పెంపు

ABOUT THE AUTHOR

...view details