ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతలను ఆదుకోవాలని.. సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్డీవో కార్యాలయం ముందు సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వాధికారులు వెంటనే స్పందించి నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
మిర్యాలగూడ డివిజన్ పరిధిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు పాలేరువాగు, మూసీ నది, కృష్ణా నది పరివాహక ప్రాంతాలలో వరదల వల్ల వరి,పత్తి పంటలు నీటిలో మునిగి పోయాయని పంటచేలలో ఇసుక మేటలు వేసిందని.. అన్నారు. డివిజన్ పరిధిలో 12వేల ఎకరాల వరి, 6 వేల ఎకరాల్లో వేసిన పత్తి పంటలు పూర్తిగా పాడయ్యాయని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తెలిపారు. కొన్నిచోట్ల వరదలకు కరెంటు స్తంభాలు, వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు వరదల్లో కొట్టుకుపోయాయని, అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన రైతులకు.. పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు తీరని నష్టం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.