వ్యాక్సిన్ల విషయంలో కేంద్రం తాత్సారం చేస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. కొవిడ్ బాధితుల కోసం నల్గొండ సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
'ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి' - కొవిడ్ ఐసోలేషన్ కేంద్రం ప్రారంభించిన బీవీ రాఘవులు
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కొవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. కరోనా బాధితుల కోసం నల్గొండ సీపీఎం కార్యాలయంలో ఐసోలేషన్ కేంద్రాన్ని రాఘవులు ప్రారంభించారు.
నల్గొండ వార్తలు
ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని ఆరోపించారు. 15 పడకలతో కూడిన తమ ఐసోలేషన్ కేంద్రం... బాధితులకు మెరుగైన సేవలు అందిస్తుందని తెలిపారు.
ఇదీ చూడండి:Covid : జలమండలిపై రెండో దశ కొవిడ్ పంజా