నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో కొవిడ్-19 విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రికి హైదరాబాద్లో లేఖను అందించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో కరోనా కేసులు రోజురోజుకు పెరగడంతో పాటు... ఎనిమిది మంది మృతి చెందారన్నారు. ఆసుపత్రిలో వంద పడకలు ఉన్నాయి.. కానీ సిబ్బంది కొరత ఉన్నందున తక్షణమే ఖాళీలను భర్తీ చేసి, వెంటిలేటర్లను ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు.
'ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో కొవిడ్ విభాగాన్ని ఏర్పాటు చేయాలి' - మిర్యాలగూడలోని ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల
మిర్యాలగూడలోని ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో కొవిడ్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి ఈటలను సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి కోరారు. ఆస్పత్రిలో తక్షణమే ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
