తెలంగాణ

telangana

ETV Bharat / state

'మిర్యాలగూడలో కరోనా పరీక్షలు పునరుద్ధరించాలి' - miryalaguda news

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సీపీఐ నాయకులు నిరసనకు దిగారు. ప్రాంతీయ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు వెంటనే పునరుద్ధరించాలని ఆందోళన చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం, సీఐటీయూ నాయకులు, కార్యకర్తలు... ఆర్డిఓ కార్యాలయంలో వినతి సమర్పించారు.

cpi leaders demanded to restart the corona rapid tests in miryalaguda hospital
cpi leaders demanded to restart the corona rapid tests in miryalaguda hospital

By

Published : Jul 23, 2020, 3:27 PM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతీయ ఆస్పత్రిలో కరోనా పరీక్షలను వెంటనే పునరుద్ధరించాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. తెల్ల రేషన్ కార్డుదారులకు రూ.7500, కార్డు లేని వారికి రూ.1500 లతో పాటు పది కిలోల రేషన్ బియ్యం ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం, సీఐటీయూ నాయకులు, కార్యకర్తలు... ఆర్డిఓ కార్యాలయంలో వినతి సమర్పించారు.

మిర్యాలగూడ ప్రాంతంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని నాయకులు ఆరోపించారు. ఏరియా ఆస్పత్రిలో రెండు రోజులు మాత్రమే కరోనా రాపిడ్ పరీక్షలు చేసి.. ఇప్పుడు కిట్లు లేవంటూ నిలిపివేశారని ఆగ్రహంవ్యక్తం చేశారు. పూర్తిస్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహించి మిర్యాలగూడ ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

'మిర్యాలగూడలో కరోనా పరీక్షలు పునరుద్ధరించాలి'

ఇదీ చదవండి: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 65 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details