నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో వృద్ధ దంపతులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆ మందులు కూడా కొనుక్కోలేనంత స్థితిని తాళలేక వారు పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత కొంతకాలంగా సరికొండ జానకమ్మ చర్మవ్యాధితో బాధపడుతుండగా.. అనేక ఆసుపత్రుల చుట్టూ తిరిగినా నయమవ్వకపోవడం, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవగా.. దిక్కుతోచని స్థితిలో బతుకుదెరువు లేక మనస్తాపానికి గురయ్యారు.
అనారోగ్యం.. ఆపై ఆర్థిక సమస్యలతో వృద్ధ దంపతుల ఆత్మహత్య - couple suicide due to financial problems at munugode
అసలే వృద్ధులు.. దానికి తోడు అనారోగ్యం బాధలు.. ఆపై ఆర్థిక ఇబ్బందులు.. ఇన్ని సమస్యలు తమపై ఒకేసారి ఎదురయ్యేసరికి తట్టుకోలేకపోయారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబసభ్యులు గమనించి వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూనే దంపతులిద్దరూ మరణించిన ఘటన నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో జరిగింది.
![అనారోగ్యం.. ఆపై ఆర్థిక సమస్యలతో వృద్ధ దంపతుల ఆత్మహత్య couple suicide due to financial problems at munugode](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8072137-249-8072137-1595054751200.jpg)
ఆర్థిక ఇబ్బందులతో వృద్ధ దంపతులు ఆత్మహత్య
అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తాళలేక.. శుక్రవారం వారిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిని గమనించిన కుటుంబసభ్యులు... వెంటనే చికిత్స నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దంపతులిద్దరూ చికిత్స పొందుతూ మరణించారు.
ఇదీ చూడండి:మహారాష్ట్రలో ఒక్కరోజే కరోనాతో 258 మంది మృతి