తెలంగాణ

telangana

ETV Bharat / state

దంపతులను బలి తీసుకున్న కరోనా

రెండు రోజుల వ్యవధిలో కరోనా మహమ్మారి నల్గొండ జిల్లాలో దంపతులను బలితీసుకుంది. చికిత్స పొందుతూ భర్త బుధవారం మృతి చెందగా... భార్య శుక్రవారం చనిపోయారు.

couple-died-with-corona-with-in-two-days-at-devarakonda-in-nalgonda-district
దంపతులను బలి తీసుకున్న కరోనా

By

Published : Apr 25, 2021, 7:45 AM IST

నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన దంపతులను కరోనా బలితీసుకుంది. స్థానికంగా నివసించే వస్త్ర వ్యాపారి(48) సోమవారం అస్వస్థతకు గురయ్యారు. అక్కడే ఉన్న ఓ ఆర్‌ఎంపీ దగ్గర చికిత్స ప్రారంభించారు. ఎంతకీ తగ్గకపోవడంతో మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి వెళ్లారు. పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

దీంతో గాంధీలోనే చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందారు. చికిత్స అందుతున్న క్రమంలో ఆయన భార్య (46) సైతం అక్కడే ఉన్నారు. భర్త మరణానంతరం ఆమె కూడా అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ఆమెకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. శుక్రవారం రాత్రి ఆమె కూడా మృతిచెందారు. ఈ ఘటనతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఇదీ చూడండి:వస్త్రవ్యాపారులపై కరోనా ప్రభావం... వెలవెలబోతున్న దుకాణాలు

ABOUT THE AUTHOR

...view details