తెలంగాణ

telangana

ETV Bharat / state

గిడ్డంగుల సంస్థ గోదాములో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు - Mlc election counting updates

నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కాసేపట్లో నల్గొండలో ప్రారంభంకానుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన ఈసీ... సిబ్బందికి విడతలవారీగా విధులు అప్పజెప్పింది. సాయుధ బలగాలు, స్థానిక పోలీసులు కలిపి మొత్తం 300 మందితో భద్రత చర్యలు చేపట్టారు.

గిడ్డంగుల సంస్థ గోదాములో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
గిడ్డంగుల సంస్థ గోదాములో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

By

Published : Mar 17, 2021, 4:54 AM IST

గిడ్డంగుల సంస్థ గోదాములో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపును నల్గొండలోని అర్జాలబావి వద్ద గల రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో చేపడుతున్నారు. 12 జిల్లాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సులను పటిష్ఠ భద్రత మధ్య భద్రపరిచారు. లెక్కింపు కోసం 8 హాళ్లను ఏర్పాటు చేసిన అధికారులు... ఒక్కో హాలులో 7 చొప్పున మొత్తంగా 56 టేబుళ్లు అందుబాటులో ఉంచారు.

వాటికే 12 గంటలు...

731 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన ఓట్లను 56 టేబుళ్లపై ఉంచుతారు. ఒక్కో టేబుల్‌పై 13 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లను ఉంచి 25 బ్యాలెట్ పత్రాల చొప్పున కట్టలు కడతారు. పోలైన మొత్తం ఓట్లను పరిశీలిస్తే వాటిని కట్ట కట్టేందుకే 12 గంటల సమయం పట్టనుంది. ఉదయం ఎనిమిదింటికి ప్రారంభమయ్యే కట్టలు కట్టే కార్యక్రమం రాత్రి ఎనిమిది గంటల వరకు కొనసాగనుంది.

అలా రాకుంటే...

నల్గొండ-ఖమ్మం-వరంగల్ నియోజకవర్గంలో పోలైన 3 లక్షల 86 వేల 320 ఓట్లు లెక్కించడానికి 10 గంటలు పడుతుందని అంచనా. చెల్లుబాటైన ఓట్లలో సగానికంటే ఒక ఓటు ఎక్కువగా ఉంటే గెలుపు కోటాగా నిర్ణయిస్తారు. అలా రానప్పుడు ఎలిమినేషన్ ప్రక్రియ మొదలు పెడతారు.

300 మందితో బందోబస్తు...

ఈ క్రతువు పూర్తవడానికి రెండ్రోజులకుపైగా సమయం పట్టే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం గిడ్డంగుల సంస్థ పరిసరాల్లో 300 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి: 'ఎమ్మెల్సీ ఎన్నికల్లో హోంమంత్రి ఓటును తొలగించాలి'

ABOUT THE AUTHOR

...view details