వచ్చే నెల 7 నుంచి జరిగే శాసనసభ సమావేశాలు కొవిడ్ నిబంధనల ప్రకారం నిర్వహిస్తామని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఇందుకోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఆవరణలో ఆటోమేటిక్ థర్మల్ స్క్రీనింగ్ మీటర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
'అసెంబ్లీ సమావేశాలకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం' - guttha sukendhar reddy latest news
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు అన్ని జాగ్రతలు తీసుకుంటున్నామని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో ఆటోమేటిక్ థర్మల్ స్క్రీనింగ్ మీటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన ఘటన దురదృష్టకరమని గుత్తా పేర్కొన్నారు.
guttha sukendhar reddy
శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన ఘటన దురదృష్టకరమని గుత్తా అన్నారు. ఘటన జరిగిన వెంటనే మంత్రి జగదీశ్ రెడ్డి, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టడం అభినందనీయమని తెలిపారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారని గుత్తా తెలిపారు.