పంట అయిపోయిన తర్వాత మిగిలిపోయిన పత్తికట్టెను తొలగించకపోవడం వల్ల పత్తిరైతులు నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. పత్తికట్టె తొలగించకపోవడం వల్ల గులాబీరంగు పురుగు తర్వాతి పంట వరకు ప్రాణాలతో ఉంటుంది. దీంతో.. కొత్త పంటకు పురుగు సోకి పంట నష్టానికి కారణమవుతున్నది.
దీనికి చెక్ పెట్టడానికి శక్తిమాన్ అనే ప్రైవేటు సంస్థ కాటన్ షెడ్డర్ యంత్రాన్ని కనిపెట్టింది. ఇది.. పత్తికట్టెను ముక్కలు ముక్కలు చేస్తుంది. ఈ యంత్రాన్ని నల్గొండ జిల్లాలోని కంపసాగర్ కృషి విజ్ఞానకేంద్రం వారు రూపొందించారు. త్వరలోనే.. ఈ యంత్రాన్ని తెలంగాణలోని అన్ని జిల్లాలకు పరిచయం చేసి.. రైతులకు అందుబాటులోకి తేనున్నారు. ఈ కాటన్ షెడ్డర్ యంత్రం దాదాపు లక్షన్నర రూపాయలకు మార్కెట్లో అందుబాటులో ఉండనుంది. ఈ యంత్రంతో గంటన్నరలో ఎకరం విస్తీర్ణంలో పత్తికట్టెను తొలగించవచ్చు. ఇందుకు ఆరు నుంచి ఏడు లీటర్ల డీజిల్ ఖర్చవుతుంది.