గత నెలలో కురిసిన వర్షాల వల్ల ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే పెద్దయెత్తున పత్తి పంటను కోల్పోయిన రైతులకు.. తాజాగా కొనుగోళ్లు నిలిచిపోవడం ఇబ్బందికరంగా మారుతోంది. మిగిలిన పంటను అమ్ముకుందామంటే.. తరచూ ఏదో ఒక అడ్డంకి ఎదురవుతోంది. ఈ నెల 26 నుంచి 30 వరకు ఐదు రోజుల పాటు కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు సీసీఐ ప్రకటించింది. 26న సార్వత్రిక సమ్మె... 27, 28న తుపాను ప్రభావం... 29 ఆదివారం... 30 సోమవారం నాడు కార్తిక పౌర్ణమి దృష్ట్యా సీసీఐ కేంద్రాలకు సెలవు ఇస్తున్నట్లు నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ప్రకటనలు విడుదలయ్యాయి. ఇలా వరుసగా ఐదు రోజుల పాటు కొనుగోళ్లు నిలిచిపోవటంతో.. రైతులు నిరాశలో ఉన్నారు. డిసెంబరు 1 నుంచి విక్రయాలు పునఃప్రారంభమవుతాయని తెలియజేయటంతో.. వాతావరణ ప్రభావానికితోడు, సరకును నిల్వ చేసే పరిస్థితి లేక అయోమయంలో పడిపోయారు.
60 శాతం తెల్లబంగారం దెబ్బతింది