తెలంగాణ

telangana

ETV Bharat / state

నల్గొండ జిల్లాలో పత్తి రైతుల కష్టాలు - అధికారుల నిర్లక్ష్యం

పత్తిని అమ్ముకోవడంలో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో నాలుగైదు రోజుల పాటు మిల్లుల వద్దే నిరీక్షిస్తున్నారు. నల్గొండ జిల్లాలో కొట్టుమిట్టాడుతున్న పత్తి అమ్మకం దారులతో మా ప్రతినిధి ముఖాముఖి.

నల్గొండ జిల్లాలో పత్తి రైతుల కష్టాలు
నల్గొండ జిల్లాలో పత్తి రైతుల కష్టాలు

By

Published : Dec 5, 2019, 7:38 AM IST

Updated : Dec 5, 2019, 8:54 AM IST

నల్గొండ జిల్లాలో పత్తి రైతుల కష్టాలు
తెల్ల బంగారాన్ని అమ్ముకోవడంలో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. సీసీఐ కేంద్రాల్లో అధికారుల పట్టింపుల్లేని చర్యలతో నాలుగైదు రోజుల పాటు మిల్లుల వద్దే నిరీక్షిస్తున్నారు. కొన్న సరకును తరలించే వరకు మిగతా పంటను కొనుగోలు చేయబోమన్న మిల్లర్ల ప్రకటనతో... సాగుదారుల్లో నైరాశ్యం నెలకొంది.

మరోవైపు తేమ శాతం 12కు మించకూడదని షరతులు విధించారు. మొదట తేమ శాతం 15కు పైగా ఉన్నా కూడా పత్తిని కొన్న అధికారులు... ఇప్పుడు 8 నుంచి 12 శాతం మాత్రమే ఉండాలని చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరకును తిరిగి తీసుకుపోలేక.. అమ్ముకునే అవకాశం లేక రైతు కన్నీరు పెడుతున్నాడు. నల్గొండ జిల్లాలో కొట్టుమిట్టాడుతోన్న పత్తి అమ్మకం దారులతో మా ప్రతినిధి ముఖాముఖి.

Last Updated : Dec 5, 2019, 8:54 AM IST

ABOUT THE AUTHOR

...view details