నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 18 సంవత్సరాలు పైబడిన వారికి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించారు. మున్సిపాలిటీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వచ్చిన ఓటీపీ నంబర్ తీసుకుని వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్తేనే.. టీకా ఇస్తున్నారు. రిజిస్ట్రేషన్ కోసం వెళ్లిన వారు.. టీకా పంపిణీ కేంద్రాలకు వెళ్లిన వారితో ఆ ప్రాంగణాలు రద్దీగా మారాయి. అధికారుల పర్యవేక్షణా లోపం వల్ల అక్కడక్కడా కరోనా నిబంధనల ఉల్లంఘన జరిగింది.
Vaccine : మిర్యాలగూడలో కొవిడ్ వ్యాక్సిన్ సెంటర్ వద్ద ప్రజల ఇబ్బందులు - covid vaccination in Nalgonda district
అధికారుల నిర్లక్ష్యం వల్ల నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభం కావాల్సిన ప్రక్రియ 11 అయినా మొదలవ్వలేదు. పెద్ద ఎత్తున బారులు తీరిన ప్రజలతో ఆ ప్రాంగణమంతా గందరగోళంగా మారింది.
మిర్యాలగూడలోని బకాల్వడా పాఠశాలలో రెండు కేంద్రాలు, గాంధీ పార్క్ స్కూల్లో మరో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఒక్కో సెంటర్లో రోజుకు 150 మందికి మాత్రమే టీకా ఇస్తున్నారు. ఈ విషయం తెలియక వస్తున్న ప్రజలతో ఆ ప్రాంతాలు రద్దీగా మారాయి. పోలీసులు రంగం ప్రవేశం చేసిన గందరగోళాన్ని తగ్గించారు.
ఉదయం 8 గంటలకే ప్రారంభమవ్వాల్సిన వ్యాక్సినేషన్ 11 దాటినా మొదలవ్వకపోవడం వల్ల టీకా పంపిణీ కేంద్రాల్లో రద్దీ ఏర్పడింది. సిబ్బందికి టీకా ఎలా ఇవ్వాలో తెలియక ఇబ్బందులు పడ్డారు. స్థానికంగా టీకా పంపిణీని పర్యవేక్షించాల్సిన డిప్యూటీ డీఎంహెచ్, ఇతర అధికారుల నిర్లక్ష్యం వల్ల వ్యాక్సినేషన్ ఆలస్యం అవుతోందని ప్రజలు వాపోయారు.