నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి, దామరచర్ల, మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రుల్లో కరోనా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మిర్యాలగూడ డివిజన్ పరిధిలో మొత్తం తొమ్మిది కొవిడ్ పరీక్ష కేంద్రాలను ఆయా ప్రాంతీయ ఆస్పత్రుల్లో ప్రారంభించారు.
ఏరియా ఆస్పత్రుల్లో కరోనా పరీక్ష కేంద్రాలు ప్రారంభం - covid test centers
కరోనా పరీక్షలు కోసం ప్రజలు జిల్లా ఆస్పత్రికి వెళ్లే అవసరం లేకుండా ఏరియా ఆస్పత్రుల్లోనే రాపిడ్ టెస్టులు చేయించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇందులో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ డివిజన్లో 9 పరీక్షా కేంద్రాలను అధికారులు ప్రారంభించారు.
corona test centers started in nalgonda area hospitals
కరోనా పరీక్ష కేంద్రాల్లో రోజుకు 20 టెస్టులు చేయించుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మిర్యాలగూడ డివిజన్ పరిధిలో దామరచర్ల, మిర్యాలగూడ, వేములపల్లి ,ఆలగడప, త్రిపురారం, నిడమనూరు, హాలియా, పెద్దవూర, సాగర్ కలిపి మొత్తం 9 ప్రాంతీయ ఆసుపత్రుల్లో కరోనా ర్యాపిడ్ టెస్టులు చేసే కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. రవి తెలిపారు. కరోనా అనుమానిత లక్షణాలున్న వారు ఏరియా ఆస్పత్రుల్లో పేరు నమోదు చేసుకొని.. పరీక్షలు చేయించుకోవాలని ప్రజలను కోరారు.
ఇదీ చూడండి:35 ప్యాకెట్ల గంజాయి స్వాధీనం.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
Last Updated : Jul 18, 2020, 7:46 PM IST