నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో కరోనా వైరస్ ర్యాపిడ్ టెస్టుల కేంద్రాన్ని ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ప్రారంభించారు. మంత్రి జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలు సందర్భంగా దవాఖానా ఆవరణలో మొక్కలను నాటి అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
సాగర్ ఏరియా ఆసుపత్రిలో కరోనా ర్యాపిడ్ టెస్టులు
రోజురోజుకు కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఏరియా ఆసుపత్రిలో కొవిడ్ ర్యాపిడ్ టెస్ట్ సెంటర్ను ఎమ్మెల్యే నర్సింహయ్య ప్రారంభించారు. వైరస్ బారిన పడుకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
నేటి నుంచి సాగర్ ఏరియా ఆసుపత్రిలో కరోనా ర్యాపిడ్ టెస్టులు
కరోనా ఉద్ధృతి రోజురోజుకు పెరిగిపోతున్న తరుణంలో సాగర్ ఏరియా ఆస్పత్రిలో ర్యాపిడ్ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయడం చాలా ఉపయోగకరమని ఆయన అభిప్రాయపడ్డారు. సామాజిక దూరం పాటిస్తూ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి :రాష్ట్రంలో 42 వేలు దాటిన కరోనా కేసులు.. 400పైగా మరణాలు