భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని సుదిమల్ల గ్రామపంచాయతీలో రైతువేదిక నిర్మాణానికి మంత్రి పువ్వాడ శంకుస్థాపన చేశారు. అనంతరం రెవెన్యూ అధికారులు కల్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి చేత పంపిణీ చేయించారు. ఇందంతా ఇలా ఉంటే కార్యక్రమం అనంతరం టేకుపల్లిలోని కార్యక్రమాలు వెళ్లగా అక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరూ బయటకు రాలేదు. కారణమేంటని ఆరా తీస్తే కార్యక్రమం అయిపోగానే వచ్చిన కరోనా పరీక్షా ఫలితాల్లో మంత్రితో పాటు పాల్గొన్న రెవెన్యూ అధికారి భార్యకు కరోనా నిర్థరణ అయినట్టు సమాచారం వచ్చింది.
అక్కడి కార్యక్రమంలో పాల్గొన్న అధికారుల్లో కరోనా కలకలం..! - latest news of corona fear in illandu officers
కొత్తగూడెం జిల్లా ఇల్లందులో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు ఇప్పించారు.. చప్పట్లు కొట్టారు.. అంతవరకు బాగానే ఉంది. కానీ కార్యక్రమం అనంతరం అందులో పాల్గొన్న రెవెన్యూ అధికారి భార్యకు కరోనా నిర్ధారణ అయ్యిందని సమాచారం వచ్చింది. దానితో విషయం తెలుసుకుని.. కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారుల్లో కరోనా కలవరం మొదలైంది.
అక్కడి కార్యక్రమంలో పాల్గొన్న అధికారుల్లో కరోనా కలకలం..!
దీనితో నిబంధనలు పాటించాల్సిన అధికారి తన భార్యతో పాటు కరోనా నిర్ధరణ కోసం శాంపిల్స్ ఇచ్చిన తర్వాత విధులకు ఎలా హాజరయ్యారని ప్రజాప్రతినిధులు, అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతగల రెవెన్యూ అధికారిగా ఉండి ఇలాంటి విపత్కర కాలంలో పూర్తి స్థాయిలో కార్యక్రమంలో పాల్గొనడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చూడండి:బాలిక అభ్యర్థనపై స్పందించిన కలెక్టర్.. స్మార్ట్ఫోన్ కానుక