అసంఘటిత రంగంపై ఆధారపడి ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు లక్షలకుపైగా కుటుంబాలున్నాయి. వారిలో భవన నిర్మాణ కార్మికులు సహా పెయింటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. గృహనిర్మాణ రంగంలో ఉపాధి పనులు చేసేందుకు వేరే రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన వారే ఉంటారు.
కరోనా కాలం.. జీవనోపాధికి సాయం! - corona effect on labor in nalgonda
కరోనా మహమ్మారి అసంఘటిత రంగ కార్మికులను కుదిపేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ సంఖ్యలో ఉన్న భవన నిర్మాణ కార్మికులూ జీవనోపాధి కోల్పోయారు. లాక్‌డౌన్ కారణంగా ఈ రంగంపై ఆధారపడిన వివిధ వృత్తుల కార్మికులు ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలు, రాష్ట్రాల సరిహద్దులు మూసి ఉంచడంతో సిమెంటు, ఇనుము, ఇసుక రవాణా కూడా స్తంభించింది.
ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని గృహాలు, సిమెంటు రహదారుల పనులు నిలిచిపోయాయి. పనులు లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి లేక.. సొంత ఊర్లకు వెళ్లలేక సతమతమవుతున్నారు. పనులు ఇస్తామని తీసుకొచ్చిన మేస్త్రీలు సైతం ఉపాధి కోల్పోవడంతో అందరూ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
కార్మికులకు సర్కారు అండ
ప్రస్తుతం భవన నిర్మాణ రంగ కార్మికుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ‘భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు’ ద్వారా సాయం అందించేందుకు బోర్డులోని ‘కార్మిక పన్ను’ నిధులను వినియోగించాలని కేంద్రం సూచించింది. ఈ క్రమంలో రాష్ట్ర ఆవిర్భావం నుంచి జమ అయిన నిధులతో వారిని ఆదుకోనున్నారు. ప్రస్తుతానికి బోర్డులోని సభ్యుని కుటుంబానికి రూ.1500 చొప్పున ఇవ్వనున్నట్లు సమాచారం. ఒకరి కన్నా ఎక్కువ మంది సభ్యులు ఉంటే.. వారిని ఒక్క యూనిట్‌గానే పరిగణిస్తారు. అధికారులు వీరి వివరాలను సేకరించనున్నారు.