నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కేవలం పట్టణంలోనే సరాసరి 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా అధికారులు వెల్లడించారు. మిర్యాలగూడ డివిజన్ పరిధిలో మొత్తం 57 కేసులు నమోదైనట్టు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి.
మిర్యాలగూడలో పెరిగిపోతున్న కరోనా కేసులు... భయాందోళనలో ప్రజలు - corona cases in telangana
కరోనా మహమ్మారి రోజురోజుకూ తన ప్రతాపం చూపిస్తోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పరిధిలో 57 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రోజురోజుకూ కొవిడ్ ఉద్ధృతి పెరగటం వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
corona cases increasing in miryalaguda
బాధితుల్లో కొంత మంది హైదరాబాద్లోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో... మరికొంత మంది హోం క్వారంటైన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అధికారులు గతంలో తీసుకున్నంత శ్రద్ధ ఇప్పుడు తీసుకోవడం లేదని పట్టణ ప్రజలు వాపోతున్నారు. పట్టణ ప్రజలను అప్రమత్తంగా ఉండాలనే కార్యాచరణను, అధికారులు, ప్రజాప్రతినిధులు చేయకపోవడం వల్లనే కరోనాను అరికట్టలేకపోతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.