నల్లగొండ జిల్లా దేవరకొండలో క్రీడా అసోసియేషన్ వారు ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సమక్షంలో కరోనాపై అవగాహన సదస్సు నిర్వహించారు. పట్టణంలోని మీనాక్షి సెంటర్ వద్ద డ్యాన్సు మాస్టర్ రమేశ్ కరోనా వేషధారణలో ప్రజలకు అవగాహన కల్పించారు.
కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎమ్మెల్యే - ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు
నల్గొండ జిల్లా దేవరకొండ ప్రజలకు ఎమ్మెల్యే రవీంద్రకుమార్ కరోనాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా వేషధారణ వేసుకున్న ఓ వ్యక్తి కరోనా దూరంగా ఉండండి వ్యక్తిగత దూరం పాటించండి అంటూ ప్రజల్లో అవగాహన పెంచారు.

కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎమ్మెల్యే
ప్రస్తుత పరిస్థితులలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భౌతిక దూరం పాటించాలని, మాస్కులు లేకుండా బయటకు రావద్దని ఎమ్మెల్యే తెలిపారు. స్వీయ నిర్బంధం వల్లే వైరస్ ను అదుపు చేయగలమని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ లింగ్యా నాయక్, సీఐ ఆదిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:లాక్డౌన్ ఉన్నా జల్లికట్టు ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు