తెలంగాణ

telangana

ETV Bharat / state

నల్గొండ జిల్లాలో విజృంభిస్తోన్న కరోనా... 179కి చేరిన కేసులు - నల్గొండలో కరోనా కేసులు

నల్గొండ జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఒక్కరోజే 24 కేసులు నమోదయ్యాయి. రెండు రోజుల వ్యవధిలోనే 41 కేసులు వెలుగుచూశాయి. మొత్తం కేసుల సంఖ్య 179కి చేరింది.

CORANA CASES IN NALGONDA DISTRICT
నల్గొండ జిల్లాలో విజృంభిస్తోన్న కరోనా... 179కి చేరిన కేసులు

By

Published : Jul 10, 2020, 7:25 PM IST

నల్గొండ జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య... అంతకంతకూ పెరుగుతోంది. కొత్తగా 24 కేసులు నమోదవడం... పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. నిన్న 17 కేసులు నిర్ధరణ కాగా... రెండు రోజుల వ్యవధిలోనే 41 కేసులు వెలుగుచూశాయి. వలస జాబితాలో చేరిన 10 మందితో కలిపి... మొత్తం కేసుల సంఖ్య 179కి చేరుకుంది. అత్యధికంగా మిర్యాలగూడలో 8, జిల్లా కేంద్రంలో 7 నమోదయ్యాయి.

ఇక మండలాల వారీగా చూస్తే... హాలియాలో 3, నిడమనూరులో 2, దేవరకొండ, గుడిపల్లి, శాలిగౌరారం, మునుగోడులో ఒక్కొక్కటి చొప్పున బయటపడ్డాయి. ఇక మరో 108 మంది నమూనాలు సేకరించి పంపిన అధికారులు.. 431 పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. కొవిడ్​తో కొత్తగా మరొకరు ప్రాణాలు కోల్పోగా... ఇప్పటివరకు మృత్యువాత పడిన వారి సంఖ్య ఆరుకు చేరింది. 143 మంది బాధితులు... ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇవీ చూడండి:వాస్తు పేరుతో ప్రజాధనం వృథా : రేవంత్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details