తెరాసకు తగిన బుద్ధి చెప్పాలంటే సాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ను గెలిపించాలని అభ్యర్థి జానారెడ్డి విజ్ఞప్తి చేశారు. నాగార్జునసాగర్‌లోని ఆయన నివాసంలో ముస్లిం మైనారిటీ ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎన్నికలు వస్తేనే తెరాస నాయకులు కనిపిస్తారని ఎద్దేవా చేశారు.
సాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ను గెలిపించండి: జానారెడ్డి - మైనారిటీ నేతలతో జానా సమావేశం
ఎన్నికలగానే తెరాస నాయకులు హడావుడిగా ప్రజలను కలిసేందుకు వస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి విమర్శించారు. నాగార్జునసాగర్‌లోని ఆయన నివాసంలో ముస్లిం మైనారిటీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి
తెరాస నాయకులు డబ్బులు, మద్యం పంచడం కోసం నెల రోజులుగా హడావుడి చేస్తున్నారని జానారెడ్డి విమర్శించారు. సాగర్ ఉపఎన్నికలో తనను గెలిపిస్తే మైనారిటీల హామీలన్నీ నెరవేరుస్తానన్నారు. త్వరలో ముస్లింలకు అన్ని సదుపాయాలు కలిపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ, కార్యకర్తలు పాల్గొన్నారు.