సాగర్ ఎన్నికల్లో తెరాసకే ఓటేస్తామని తండావాసులతో ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ప్రమాణం చేయించడం వివాదాస్పదంగా మారింది. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం బుడ్డితండాలో ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే శంకర్‌నాయక్... తండావాసులతో ప్రమాణం చేయించడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది.
తెరాసకే ఓటు వేయాలని ఓటర్లతో ప్రమాణం... కాంగ్రెస్ అభ్యంతరం - కాంగ్రెస్ ఆందోళన
నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని బుడ్డితండా వాసులతో తెరాసకే ఓటు వేస్తామని ఎమ్మెల్యే శంకర్నాయక్ప్రమాణం చేయించడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ పోలీస్‌స్టేషన్ ముందు ధర్నాకు దిగారు.
దీన్ని నిరసిస్తూ... కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు... కార్యకర్తలతో త్రిపురారం పోలీస్‌స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. పోలీసులు తెరాసకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యంలో తమకు ఇష్టం వచ్చిన వారికి ఓటు వేసుకునే వెసులుబాటు ఉందని పేర్కొన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు తండా వాసులను భయపెట్టి, ప్రలోభాలకు గురి చేసి తమకు ఓటు వేయాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.