తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపు నల్గొండ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన: ఉత్తమ్​

రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రైతులకు మద్దతుగా రేపు నల్గొండ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేయనున్నట్లు ఉత్తమ్​కుమార్​రెడ్డి తెలిపారు.

By

Published : Nov 4, 2020, 2:26 PM IST

congress party conducting protest in front of nalgonda collector office
congress party conducting protest in front of nalgonda collector office

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని టీపీసీసీ అధ్యక్ష డు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి మాణిక్కం ఠాకూర్​తో కలిసి సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.

రైతులకు మద్దతుగా రేపు నల్గొండ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేయనున్నట్లు ఉత్తమ్​కుమార్​రెడ్డి తెలిపారు. రైతుకు వ్యతిరేకంగా మోదీ సర్కారు తీసుకొచ్చిన నూతన రైతు చట్టానికి వ్యతిరేకంగా రెండు కోట్ల రైతుల సంతకాలతో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని వివరించారు.

ఇదీ చూడండి: దుబ్బాక గెలుపుపై పార్టీల ధీమా... మెజార్టీ లెక్కల్లో నేతలు

ABOUT THE AUTHOR

...view details