తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రలోభాలతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచారు: కోమటిరెడ్డి - జానారెడ్డి తరఫున ఎంపీ ప్రచారం

పట్టభద్రులు, ఉద్యోగ సంఘాలను ప్రలోభాలకు గురిచేసి తెరాస ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిందని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. సాగర్ ఉపఎన్నికలో జానారెడ్డిని గెలిపించాలని ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు. నల్గొండ జిల్లా పెద్దవురలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

congress MP komatireddy venkat reddy
నల్గొండ జిల్లా పెద్దవురలోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

By

Published : Apr 7, 2021, 6:18 PM IST

నాగార్జున సాగర్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డిని గెలిపించాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఓటర్లను కోరారు. ఏడేళ్లలో తెరాస నాయకులు చేసిన అభివృద్ధి ఏంటో చూపాలని ప్రశ్నించారు. నల్గొండ జిల్లా పెద్దవురలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రలోభాలతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థలు గెలిచారని విమర్శించారు.

సాగర్ ఉపఎన్నికలో ప్రచారానికి పది మంది ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్‌ పురమాయించారని ఎద్దేవా చేశారు. జానారెడ్డిని విమర్శించే అర్హత బాల్క సుమన్‌కు లేదని మండిపడ్డారు. బాల్క సుమన్ తన నియోజకవర్గంలో ఒక్క ఇళ్లైనా నిర్మించాడా అని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తి కాంగ్రెస్‌ నేతలపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. తెరాస ప్రలోభాలను పార్టీ నేతలు, కార్యకర్తలు అడ్డుకోవాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచించారు.

ఇదీ చూడండి:ముఖ్యమంత్రి చేతిలో రాష్ట్రం నలిగిపోతుంది: భట్టి

ABOUT THE AUTHOR

...view details