తెలంగాణ

telangana

ETV Bharat / state

Rajagopal Reddy: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. భాజపాలో చేరడంపై క్లారిటీ..! - munugodu

Rajagopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా నన్ను దెబ్బ తీసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. నేను పార్టీ మారుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను దిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశానని తెలిపారు.

Rajagopal Reddy
Rajagopal Reddy

By

Published : Jul 23, 2022, 10:59 PM IST

Rajagopal Reddy: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి భాజపాలో చేరుతున్నట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను దిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశానని తెలిపారు. అమిత్‌షాను కలవడం ఇది కొత్త కాదని.. అనేక సార్లు కలిసినట్లు పేర్కొన్నారు. రాజకీయంగా నన్ను దెబ్బతీసేందుకే దుష్ప్రచారం చేస్తున్నారని రాజగోపాల్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్‌షాతో భేటీ కావడం అందరి సమక్షంలోనే జరిగినట్టు ఆయన వివరించారు.

కాంగ్రెస్​తో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు పత్రికల్లో, మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోందన్నారు. కేసీఆర్‌ కుటుంబం అవినీతి, ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తున్నానని తెలిపారు. రాజకీయంగా దెబ్బ తీసేందుకే ఊహాగానాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల పార్టీ కార్యకర్తలను గందరగోళానికి గురి చేసే కుట్రకు తెరలేపారన్నారు. ఈ ప్రచారంపై కార్యకర్తలు, అభిమానులు ఎలాంటి అయోమయానికి గురి కావద్దని రాజ్‌గోపాల్‌రెడ్డి సూచించారు. తాను పార్టీ వీడే పరిస్థితి వస్తే అందరితో భువనగిరి లోక్‌సభ, మునుగోడు నియోజకవర్గం ప్రజలు కార్యకర్తలతో చర్చించకుండా తాను ఏ నిర్ణయం తీసుకోనని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details