నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతీయ ఆస్పత్రిలో వెంటనే కరోనా పరీక్షలు పునరుద్ధరించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా రోజు వారి కరోనా పరీక్షలను పెంచుతూ కొవిడ్ బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు. మిర్యాలగూడలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కరోనా పరీక్షలు పునరుద్ధరించాలంటూ కాంగ్రెస్ నాయకుల నిరసన - మిర్యాలగూడెం ప్రభుత్వాసుపత్రిలో కరోనా పరీక్షల నిలిపివేత
నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతీయ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. కొవిడ్ రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలంటూ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు వినతి పత్రం సమర్పించారు.
కరోనా పరీక్షలు పునరుద్ధరించాలంటూ కాంగ్రెస్ నాయకుల నిరసన
గత ఐదు రోజులుగా స్థానిక ఆస్పత్రిలో కరోనా ర్యాపిడ్ టెస్టులు చేయకపోవడాన్ని తీవ్రంగా ఖండితున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైరస్ బారిన పడి చనిపోయిన కుటుంబాలకు పది లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో తగ్గని కరోనా ఉద్ధృతి.. గంటకు 62 పాజిటివ్ కేసులు