నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోని కురిసిన భారీ ఈదురు గాలులకు పులిచర్లలోని బత్తాయి తోటలో చాలావరకు చెట్లు విరిగిపోయాయి. పలువురి రేకుల ఇళ్లు సైతం దెబ్బతిన్నాయి. మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి... పులిచర్ల గ్రామంలో పర్యటించారు. ఈదురు గాలుల వల్ల నష్టపోయిన బత్తాయి రైతులను, ఇళ్లు దెబ్బతిన్న బాధితులను పరామర్శించారు.
బత్తాయి రైతులను పరామర్శించిన జానారెడ్డి - janareddy
నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో నిన్న రాత్రి వీచిన భారీ ఈదురు గాలులకు కాయలు రాలిపోయి నష్టపోయిన బత్తాయి రైతులను మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి పరామర్శించారు. ఈదురుగాలులకు ఇళ్లు దెబ్బతిన్న వారిని కూడా పరామర్శించి.. పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బత్తాయి రైతులను పరామర్శించిన జానారెడ్డి
బాధితులకు వెంటనే పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఐకేపీ కేంద్రం వద్దకు వెళ్లి ధాన్యం కొనుగోళ్లను పరిశీలించారు.
ఇవీ చూడండి; సమగ్ర వ్యవసాయ విధానంపై మంత్రి సమీక్ష