తెలంగాణ

telangana

ETV Bharat / state

'యాసంగి పంట కొనుగోలుకు ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేయాలి' - telangana congress latest news

రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసి ఎలక్షన్ల పేరుతో పబ్బం గడుపుతోందని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి ఆరోపించారు. రైతుల వద్ద నుంచి యాసంగి పంటను కొనుగోలు చేయడానికి ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. నల్గొండ జిల్లా తక్కెళ్లపాడు గ్రామంలో కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు.

Concern of Congress leaders seeking to set up IKP centers
ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేతల ఆందోళన

By

Published : Apr 2, 2021, 4:22 PM IST

Updated : Apr 2, 2021, 7:16 PM IST

ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైందని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్​ అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి ఆరోపించారు. యాసంగి పంటను కొనుగోలు చేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ.. నల్గొండ జిల్లా తక్కెళ్లపాడు గ్రామంలో పార్టీ కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను గాలికొదిలేసి.. ఎలక్షన్ల పేరుతో పబ్బం గడుపుతోందని ముదిరెడ్డి నర్సిరెడ్డి ఆరోపించారు. పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల అన్నదాతలు ఆందోళన చేందుతున్నారని తెలిపారు. మిల్లర్లు మద్దతు ధరతోపాటు తూకంలోనూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇకనైనా కొనుకోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. లేనిపక్షంలో రైతులతో కలిసి నల్గొండ జిల్లా కలెక్టరేట్​ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, పార్టీ నాయకులు పొదిల శ్రీను, బత్తుల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:కాంగ్రెస్​లో మార్పు.. వద్దు వద్దంటూనే మళ్లీ దోస్తీ!

Last Updated : Apr 2, 2021, 7:16 PM IST

ABOUT THE AUTHOR

...view details