ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ను గెలిపించాలని జానారెడ్డి కోరారు. ప్రజలను దోచుకుంటున్న తెరాసకు తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా నిడమనూరు మండల తుమ్మడంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
ఉపఎన్నికలో తెరాసకు తగిన బుద్ధి చెప్పాలి: జానారెడ్డి - ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ నేతలు
సాగర్ ఉపఎన్నికలో అధికార, ప్రతిపక్షాలు ప్రచారం ముమ్మరం చేశాయి. కాంగ్రెస్, తెరాస మధ్యనే ప్రధానంగా పోటీ జరగనుండగా ముఖ్య నేతలందరూ ప్రచారంలో పర్యటిస్తున్నారు. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం తుమ్మడంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి పాల్గొన్నారు.
![ఉపఎన్నికలో తెరాసకు తగిన బుద్ధి చెప్పాలి: జానారెడ్డి Congress leaders election campaign in sagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11268292-810-11268292-1617462648211.jpg)
సాగర్ ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి
అంతకుముందే జానారెడ్డి హాలియాలోని పలువురు కాంగ్రెస్ నాయకులతో సమావేశం నిర్వహించారు. గుర్రంపోడు మండలం నుంచి వచ్చిన తెరాస నాయకులను కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. అధికార తెరాసకు తగిన గుణపాఠం చెప్పేందుకు సాగర్ ఉపఎన్నిక కీలకమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సాగర్ అభివృద్ధికి దశాబ్దాలుగా కృషి చేసిన జానారెడ్డిని గెలిపించాలని మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, దామోదర్ రెడ్డి ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.