నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఛార్జీల పెంపుపై ప్రభుత్వం పునరాలోచించాలంటూ కలెక్టర్ అందుబాటులో లేకపోవడం వల్ల వినతిపత్రాన్ని సీసీకు అందజేశారు. బస్ ఛార్జీలు పెంచటం వల్ల ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని.. ఆ భారాన్ని ప్రభుత్వమే భరించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్ కోరారు.
ఛార్జీల పెంపుపై కలెక్టరేట్ ముందు కాంగ్రెస్ శ్రేణుల ధర్నా - congress leaders dharna at nalogonda collectorate
ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నాకు దిగారు.
ఛార్జీల పెంపుపై కలెక్టరేట్ ముందు కాంగ్రెస్ శ్రేణుల ధర్నా