నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షులు నాగరిగారి ప్రీతమ్ తన సొంత ఖర్చులతో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టే బాధ్యత అందరిపై ఉందని నాగరిగారి ప్రీతమ్ అన్నారు. గత మూడు రోజులుగా నియోజకవర్గంలోని పలు మండలాల్లో రసాయనాన్ని పిచికారీ చేయిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బండపల్లి కొమురయ్య , శాలిగౌరారం ఉపసర్పంచ్ గోదల సుధాకర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు, వార్డ్ మెంబర్లు, తదితరులు పాల్గొన్నారు.
సొంత ఖర్చులతో రసాయనాన్ని పిచికారీ చేయించిన కాంగ్రెస్ నేత - సోడియం హైపో క్లోరైట్
కరోనా వైరస్ను తరిమికట్టే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షులు నాగరిగారి ప్రీతమ్ అన్నారు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంలో తన సొంత ఖర్చులతో రసాయనాన్ని పిచికారీ చేయించారు.

సొంత ఖర్చులతో రసాయనాన్ని పిచికారీ చేయించిన కాంగ్రెస్ నేత