palvai sravanthi audio viral: రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా నిర్ణయంతో ఉపఎన్నిక అనివార్యంగా మారింది. కాంగ్రెస్ కంచుకోటలాంటి నల్గొండ జిల్లాలో ఓవైపు ఆ పార్టీ నేతలు నష్టనివారణ చర్యలు చేపట్టారు. మరోవైపు మునుగోడు ఉపఎన్నికలో టికెట్ ఎవరికి దక్కుతుందనే అంశం కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. చలమల్ల కృష్ణారెడ్డికి పోటీ చేసే అవకాశం ఇస్తారనే ప్రచారంపై సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. తనకు టికెట్ ఇవ్వకపోతే హుజురాబాద్ వంటి అవమానం మరోసారి జరిగే అవకాశముందని.... పాల్వాయి స్రవంతి మాట్లాడిన ఆడియో.. సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.
Palvai Sravanthi Audio Viral: 'ఆ మాత్రం రేవంత్‌రెడ్డికి తెల్వదా..' పాల్వాయి స్రవంతి ఆడియో వైరల్! - పాల్వాయి స్రవంతి కామెంట్స్
palvai sravanthi audio viral: మునుగోడు ఉపఎన్నికతో రాష్ట్రంలో ఎన్నికలవేడి మొదలైంది. అయితే ఇదిలా ఉండగా పాల్వాయి స్రవంతి ఆడియో కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. సామాజిక మాధ్యామాల్లో స్రవంతి ఆడియో హల్‌చల్ చేస్తోంది.
palvai sravanthi reddy audio viral in social media
ఆడియోలో ఏముందంటే... మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ అంతర్గత పోరు జరుగుతోంది. చలమల్ల కృష్ణారెడ్డి టికెట్ ఇస్తారనే ప్రతిపాదనపై వ్యతిరేకత వస్తోంది. తనకు టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్‌కు పరాజయం తప్పదని పాల్వయి స్రవంతి పేర్కొన్నారు. కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తే ఊరుకునేదిలేదని స్పష్టీకరణ చేశారు. హుజూరాబాద్ వంటి అవమానం మళ్లీ జరుగుతుందని అభిప్రాయపడ్డారు. రేవంత్ పరువు నిలవాలంటే గెలిచే వారికి టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.