సాగర్ ఉప ఎన్నికల పోలింగ్‌కు ముందు.. నిడమనూరు మండలం ఉట్కూరులో డబ్బుల పంపిణీ ఘటన కలకలం రేపింది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కృష్ణయ్యను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 43 వేలను స్వాధీనం చేసుకున్నారు.
ఓటర్లకు డబ్బుల పంచుతున్నాడని కాంగ్రెస్ కార్యకర్త అరెస్ట్ - ఓటర్లకు డబ్బుల పంపిణీ
సాగర్ ఉప ఎన్నికల ప్రచారం ఇలా ముగిసిందో లేదో అప్పుడే డబ్బుల పంపిణీ మొదలయిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పోలీసులు.. అనుమానం వచ్చిన నేతలు, పార్టీల మద్దతుదారుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. ఇలాగే ఉట్కూరు గ్రామంలో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో వారు ఓ కాంగ్రెస్ కార్యకర్తను అదుపులోకి తీసుకున్నారు.
![ఓటర్లకు డబ్బుల పంచుతున్నాడని కాంగ్రెస్ కార్యకర్త అరెస్ట్ sagar by elections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11424460-355-11424460-1618566187654.jpg)
సాగర్ ఉప ఎన్నికలు
విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు పీఎస్‌కు చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాము ఎవరికీ డబ్బులు ఇవ్వలేదని కృష్ణయ్య తెలిపారు. అవి తన డబ్బులేనంటూ వివరణ ఇవ్వగా.. పోలీసులు అతనిని వదిలేశారు. విచారణ అనంతరం డబ్బులు తిరిగిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి:మంత్రి ఈటల కాన్వాయ్‌ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు