రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలంటూ బాధితులు ఆందోళన నిర్వహించడంతో... నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని మృతదేహాలు తరలించే వాహనానికి భాజపా శ్రేణులు అడ్డుపడ్డారు.
ఆస్పత్రిలో ఆందోళన... మృతుల కుటుంబాలు, పోలీసుల తోపులాట - Telangana News Updates
నల్గొండ జిల్లా దేవరకొండ ఆస్పత్రి వద్ద మృతుల కుటుంబాలు ఆందోళన చేపట్టారు. పరిహారం ప్రకటించాలని భాజపా ఆందోళన నిర్వహించింది. పోలీసులు, మృతుల కుటుంబీకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.
దేవరకొండ ఆస్పత్రి వద్ద మృతుల కుటుంబాల ఆందోళన
శవపరీక్ష అనంతరం మృతదేహాలను మృతుల స్వగ్రామం చింతబావికి తరలించే ఏర్పాట్లు చేశారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. నిరసనకారులను నిలువరించేందుకు భారీగా పోలీసులు మోహరించారు.