Collector inspected the polling booths in Munugode: మునుగోడు ఉపఎన్నికల పోలింగ్ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. పోలింగ్‌కు మరో 8రోజులే ఉండటంతో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 105 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించగా.. అక్కడ ప్రత్యేక బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు నల్గొండ కలెక్టర్ వినయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
నాంపల్లిలోని పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ఆయన.. అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలింగ్ కేంద్రంలోని గదుల్లో ఫర్నీచర్, లైటింగ్, వెబ్‌క్యాస్టింగ్‌తో పాటు సిబ్బందికి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరో రెండు మూడు రోజుల్లో కేంద్రాలన్నీ పోలింగ్ కోసం సిద్ధమవుతాయన్న ఆయన.. ఒకటో తేదీ సాయంత్రం 6లోగా స్థానికేతరులంతా నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుందని చెప్పారు.