సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లాపై వరాలు కురిపించారు. జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షలు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రతి మండల కేంద్రానికి రూ.30 లక్షలు ఇస్తామన్నారు. నల్గొండ మున్సిపాలిటీకి రూ.10 కోట్లు, మిర్యాలగూడ మున్సిపాలిటీకి రూ.5 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
త్వరలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తాం: కేసీఆర్ - సీఎం కేసీఆర్ వార్తలు
త్వరలో కొత్త పింఛన్ల ప్రక్రియ చేపడతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. నల్గొండ జిల్లా హాలియ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం నల్గొండ జిల్లాపై వరాలు కురిపించారు.
![త్వరలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తాం: కేసీఆర్ cm participated in haliya public meeting in nalgonda district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10570757-thumbnail-3x2-na.jpg)
హాలియా సభకు బయల్దేరిన సీఎం కేసీఆర్
నెల్లికల్లు, చింతలపాలెం ప్రాంతాల్లో భూవివాదం ఉందని.. ఈ సమస్య పరిష్కరించి త్వరలో పట్టాలు ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. కరోనా కారణంగా చాలా పనులు పెండింగ్‌లో ఉన్నాయని త్వరలో కొత్త పింఛన్ల ప్రక్రియ చేపడతామని ప్రకటించారు. ప్రతి గ్రామానికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు.
త్వరలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తాం: కేసీఆర్
ఇదీ చదవండి:నెల్లికల్లులో ఎత్తిపోతల పథకాలకు సీఎం శంకుస్థాపన
Last Updated : Feb 10, 2021, 5:17 PM IST