ముఖ్యమంత్రి కేసీఆర్ హాలియా చేరుకున్నారు. హాలియా వ్యవసాయ మార్కెట్‌లో ప్రగతి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో సాగర్ నియోజకవర్గ సమస్యలు, సాగర్ ఉపఎన్నికల్లో ఇచ్చిన హామీల పురోగతిపై మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చిస్తున్నారు. నెల్లికల్, ఇతర ఎత్తిపోతలు, సమస్యల పరిష్కారానికి సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు.
సమీక్ష అనంతరం ఎమ్మెల్యే నోముల భగత్ ఇంటికి వెళ్లి... అక్కడ ఓ గంటసేపు ఉండి తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు.
భారీ భద్రతా ఏర్పాట్లు...
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో... పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హాలియా పట్టణంలో... పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. చెక్ పోస్ట్ ప్రాంతం నుంచి సభా వేదిక స్థలి అయిన వ్యవసాయ మార్కెట్ యార్డు వరకు రహదారులన్నీ కట్టుదిట్టం చేశారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులకు పాసులు అందజేశారు. మొత్తం రెండున్నర వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి మండలానికి ఒక గ్యాలరీ చొప్పున అందుబాటులో ఉంచి... ఆయా మండలానికి చెందిన వ్యక్తుల్ని మాత్రమే అందులోకి అనుమతిస్తున్నారు.
ఇదీ చూడండి:CM KCR TOUR: హామీల అమలుకై.. నేడు హాలియాలో పర్యటించనున్న సీఎం కేసీఆర్