ఈటీవీ భారత్ కథనానికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. 'కేసీఆర్ తాతా నన్ను బతికించవా ప్లీజ్' కథనంపై సీఎం స్పందించారు. చైత్రకు నయం అయ్యేంతవరకు చికిత్స జరిపిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. చైత్ర చికిత్స బాధ్యతను ప్రభుత్వమే తీసుకుటుందని ఆయన భరోసానిచ్చారు. సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు సీఎం ఫోన్ చేసి విషయం తెలిపారు.
ఈటీవీ భారత్ కథనంపై స్పందించిన సీఎం కేసీఆర్ - Telangana news
22:25 April 11
ఈటీవీ భారత్ కథనంపై స్పందించిన సీఎం కేసీఆర్
నాగార్జునసాగర్ ఉపఎన్నికలో అనుముల మండలం ఇన్‌ఛార్జిగా ఎమ్మెల్యే కోనప్ప కొనసాగుతున్నారు. సీఎం ఆదేశాల మేరకు చైత్ర ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే.. కేసీఆర్ ఇచ్చిన హామీని చైత్ర తల్లిదండ్రులకు తెలిపారు.
ఈటీవీ భారత్లో వచ్చిన కథనాన్ని సీఎం చూశారు. చైత్రకు వైద్యం చేయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. చైత్ర తల్లిదండ్రులు రేపు కలవాలని సీఎం సూచించారు.
--- కోనప్ప, ఎమ్మెల్యే
సీఎం ఇచ్చిన హామీని ఈటీవీ భారత్ ప్రతినిధికి ఎమ్మెల్యే కోనప్ప తెలిపారు.