తెలంగాణ

telangana

ETV Bharat / state

Cm kcr tribute: ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ కుటుంబానికి సీఎం పరామర్శ - Cm kcr nalgonda tour

Cm kcr tribute: ఇటీవల గుండెపోటుతో మరణించిన తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుటుంబాన్ని సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఇవాళ నల్గొండ వెళ్లిన ముఖ్యమంత్రి... ఎమ్మెల్యే తండ్రికి నివాళులర్పించారు.

Cm kcr tribute
Cm kcr tribute

By

Published : Dec 29, 2021, 3:11 PM IST

Updated : Dec 29, 2021, 5:14 PM IST

ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ కుటుంబానికి సీఎం పరామర్శ

Cm kcr tribute: తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్.. తండ్రి మారయ్య దశదినకర్మ కార్యక్రమంలో సీఎం కేసీఆర్​ పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని కనకదుర్గ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో మారయ్య చిత్రపటానికి సీఎం పూలమాల వేసి... శ్రద్ధాంజలి ఘటించారు. కిశోర్ తండ్రి మారయ్య ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్​లో బయలుదేరి వచ్చిన సీఎం కేసీఆర్... నల్గొండలోని ఎన్జీ కళాశాల మైదానానికి మధ్యాహ్నం 1:28 గంటలకు చేరుకున్నారు.

అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ఇంటికి 1:40కి చేరుకున్నారు. ఎమ్మెల్యేను ఆయన కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించారు. అక్కడే భోజనం చేసిన కేసీఆర్... అనంతరం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం చేరుకున్నారు. పలు అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న పనులపై సీఎం ఆరా తీశారు. మౌలిక వసతులు, పలు అభివృద్ధి పనులపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సీఎంతో పాటు మంత్రులు హరీశ్‌ రావు, జగదీశ్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోశ్ కుమార్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్​కు తిరుగు ప్రయాణం అయ్యారు.

ఇవీ చూడండి:

Last Updated : Dec 29, 2021, 5:14 PM IST

ABOUT THE AUTHOR

...view details