CM KCR: నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కుటుంబాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. ఇటీవల ఎమ్మెల్యే తండ్రి నర్సింహ మృతి చెందగా దశదినకర్మ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. నార్కట్‌పల్లిలోని రాశి ఫ్యాక్టరీ వద్ద ఏర్పాటు చేసిన సంతాప కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, తెరాస నేతలు నర్సింహకు నివాళులర్పించారు.
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్ - cm kcr update news
CM KCR: నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి సంతాపసభకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు హాజరయ్యారు. ఎమ్మెల్యే తండ్రి నర్సింహ చిత్రపటానికి కేసీఆర్, కేటీఆర్‌తో పాటు మంత్రి జగదీశ్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు నివాళులర్పించారు.
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్
అనంతరం ఎమ్మెల్యే కుటుంబసభ్యులతో సీఎం మాట్లాడారు. వారికి తన సానుభూతి వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా 700మందితో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
Last Updated : Apr 28, 2022, 3:17 PM IST