నాగార్జునసాగర్ కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై సీఎం కేసీఆర్ విచుకుపడ్డారు. జానారెడ్డికి 30 ఏళ్ల అనుభవం ఉన్నా నియోజకవర్గానికి చేసింది శూన్యమని విమర్శించారు. హాలియాకు డిగ్రీ కళాశాలను కూడా తీసుకురాలేదన్నారు. నందికొండకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ నేతలు పదవుల కోసమే పాకులాడారని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం పదవులను గడ్డిపోచల్లాగా వదులుకున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు పదవుల కోసం తెలంగాణను తాకట్టు పెట్టారని ఆరోపించారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణ లక్ష్మీ పథకాలు గతంలో ఉన్నాయా? అంటూ సీఎం ప్రశ్నించారు. పైరవీలు, మధ్యవర్తులు లేకుండా అందరికీ రైతుబంధు ఇస్తున్నామన్నారు.