సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, భాజపా నాయకులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని.. తాము తల్చుకుంటే వారు మిగలరని భాజపాను ఉద్దేశించి హెచ్చరించారు. ఇతర సభల వద్ద వీరంగం సృష్టించడం మంచిదికాదని హాలియా సభలో హితవు పలికారు.
మేం తల్చుకుంటే మీరు మిగలరు: కేసీఆర్ - నల్గొండ జిల్లా తాజా వార్తలు
కాంగ్రెస్, భాజపా నాయకులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్ విమర్శించారు. తాము తల్చుకుంటే వారు మిగలరని భాజపాను ఉద్దేశించి హెచ్చరించారు.
మేం తల్చుకుంటే మీరు మిగలరు: కేసీఆర్
వారికి రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. డిండి, ఎస్‌ఎల్‌బీసీ త్వరలో పూర్తికాబోతున్నాయన్నారు. ఇంటింటికీ నీళ్లు ఇచ్చి హామీ నిలబెట్టుకున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ పేరు ఉచ్చరించే అర్హత కూడా లేదన్నారు.
Last Updated : Feb 10, 2021, 6:25 PM IST