నాగార్జున సాగర్ ఆయకట్టుకు ఇవాళ్టి నుంచి నీరు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కృష్ణానది ఎగువన నీటిప్రవాహాలు ఆశాజనకంగా ఉండడంతో పాటు ఈ ఏడాది వర్షాలు కూడా బాగానే పడే అవకాశం ఉన్నందున సాగర్ ఆయకట్టు రైతులకు పూర్తి స్థాయిలో నీరివ్వాలని సీఎం నిర్ణయించారు.
ఇవాళ్టి నుంచి సాగర్ ఆయకట్టుకు నీటి విడుదల - నాగార్జునసాగర్ నీటి విడుదల వార్తలు
నాగార్జునసాగర్ ఆయకట్టుకు ఇవాళ్టి నుంచి సాగునీరు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు నీటిని విడుదల చేయాలని సాగర్ చీఫ్ ఇంజినీర్‌ను ఆదేశించారు. ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో నీరు అందించాలని సూచించారు. సీఎం ఆదేశాలో అధికారులు సాగునీరు విడుదల చేయనున్నారు.
KCR
నల్గొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో ఉన్న నాగార్జునసాగర్ ఆయకట్టు రైతులకు వానాకాలం పంటల కోసం పూర్తిస్థాయిలో నీరు అందించాలని పేర్కొన్నారు. ఇవాళ్టి నుంచే నీటి విడుదల ప్రారంభం కావాలని నాగార్జునసాగర్ చీఫ్ ఇంజినీర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.