తెలంగాణ

telangana

ETV Bharat / state

'వెనకబాటుకు కారణం మీరే... ఎందుకు పొలంబాట-పోరుబాట?' - Cm kcr latest updates

తెరాస హయాంలో వంద శాతం ఫ్లోరైడ్ భూతాన్ని తరిమేశామని సీఎం కేసీఆర్ అన్నారు. నల్గొండ జిల్లా హాలియాలో తెరాస భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్... తెరాస చేసిన అభివృద్ధిని వివరిస్తూనే... ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

'వెనకబాటుకు కారణం మీరే... ఎందుకు పొలంబాట-పోరుబాట?'
'వెనకబాటుకు కారణం మీరే... ఎందుకు పొలంబాట-పోరుబాట?'

By

Published : Feb 10, 2021, 5:50 PM IST

Updated : Feb 10, 2021, 7:04 PM IST

'వెనకబాటుకు కారణం మీరే... ఎందుకు పొలంబాట-పోరుబాట?'

తెరాస అధికారంలోకి వచ్చాకా... ఉమ్మడి నల్గొండ జిల్లాలో వంద శాతం ఫ్లోరైడ్ భూతాన్ని తరిమేశామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్‌ అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. అభివృద్ధి దిశగా పయనిస్తున్నందుకు 'పొలం బాట' చేపట్టారా? అని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. ఎఫ్‌సీఐకి అత్యధిక వడ్లు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని వివరించారు.

మీకందరికి గుర్తున్నది... నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ భూతం ఒక జనరేషన్​నే నాశనం చేసింది. లక్షా 50 వేల మంది జీవితాలను పొట్టనపెట్టుకున్నది. ఒక్కరన్న మాట్లాడిండా? కొట్లాండిండా? ప్రయత్నం చేసిండ్రా? ఉద్యమాలు చేసిండ్రా? చేయకపోంగా... చేసినవాళ్లను అవమానపర్చింన్రు. ఇక్కడి ఫ్లోరైడ్ బిడ్డలను ఆనాటి ప్రధాని వాజ్​పేయి టేబుల్ మీద పడుకోబెట్టి అడిగినా కూడా దిక్కులేదు. బొక్కలు వంగినా, నడుములు పోయినా... ఒక్కడు పట్టించుకోలే. కానీ నేడు తెరాస ప్రభుత్వం... వంద శాతం ఫ్లోరైడ్ భూతాన్ని తరిమేసింది. ఎందుకు 'పొలంబాట-పోరుబాట'? రాష్ట్రం అభివృద్ధిలో దిశలో సాగుతున్నందుకా? రైతుబంధు ఇస్తున్నందుకా? రైతుబీమా అమలు చేస్తున్నందుకా? ఉచిత విద్యుత్ ఇస్తున్నందుకా? నల్గొండ జిల్లా వెనకబాటు గురికావడానికి కారణం మీరే.

--- హాలియా సభలో సీఎం కేసీఆర్

ఇదీ చూడండి:త్వరలో కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేస్తాం: కేసీఆర్​

Last Updated : Feb 10, 2021, 7:04 PM IST

ABOUT THE AUTHOR

...view details