తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును అడ్డుకుంటాం: భట్టి - తౌక్లాపూర్​లో మల్లు భట్టి విక్రమార్క పర్యటన

నల్గొండ జిల్లా డిండి మండలం తౌక్లాపూర్​లో పొలంబాట-పోరుబాటలో భాగంగా... సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క రైతులతో మాట్లాడారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరు, కేంద్రం తీసుకొచ్చిన నల్ల చట్టాల గురించి వివరించారు.

clp leader mallu bhatti vikramarka tour in thouklapur nalgonda district
రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును అడ్డుకుంటాం: భట్టి

By

Published : Feb 17, 2021, 8:21 PM IST

నల్లగొండ జిల్లా డిండి మండలం తౌక్లాపూర్​లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పర్యటించారు. పొలంబాట-పోరుబాట కార్యక్రమంలో భాగంగా రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతుల వెన్నెముక విరుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అడ్డుకుంటామన్నారు. రైతుల పట్ల ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును ప్రజలకు వివరించారు. రైతులకు కొత్తగా భూములు ఇవ్వకపోగా... గతంలో ఇచ్చినవి లాక్కుంటున్నారని ఆరోపించారు.

తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు మనకే అన్న కేసీఆర్​... నీటిపారుదల ప్రాజెక్టుల పేరుతో... పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. డిండి ప్రాజెక్టు పేరు మీద కోట్లు దోచుకుంటున్నారు కానీ... అసలు నీళ్లు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాలు నాయక్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ఉద్యోగాల భర్తీపై సీఎంకు చిత్తశుద్ధి లేదు: ఉత్తమ్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details