నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయమని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా త్రిపురారం, మాడ్గులపల్లి మండలాల్లోని అనారోగ్యంతో ఉన్న పార్టీ కార్యకర్తలను పరామర్శించారు. అనంతరం మాడుగులపల్లి మండలం ధర్మాపురంలో ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందు మాజీ ప్రధాని పీవీ వర్థంతి సందర్భంగా... ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ప్రజల హృదయాల్లో నా స్థానం ఇప్పటికీ పదిలమే..: జానారెడ్డి - నాగార్జునసాగర్ ఉపఎన్నికలపై జానారెడ్డి వ్యాఖ్యలు
నల్గొండ జిల్లా త్రిపురారం, మాడ్గులపల్లి మండలాల్లో సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి పర్యటించారు. అనారోగ్యం బారిన పడిన పలువురు కార్యకర్తలను పరామర్శించారు. అంతకు ముందు పీవీ వర్థంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన... నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విజయమని ధీమా వ్యక్తం చేశారు.

నాపై ప్రజలకు అభిమానం ఇంకా ఉంది.. కాంగ్రెస్‌దే విజయం: జానా
సాగర్ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి తప్ప ఎవరూ చేసిందేమీ లేదని జానారెడ్డి వ్యాఖ్యానించారు. 35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ... రోడ్లు లేని గ్రామాలకు సైతం రవాణా సౌకర్యం కల్పించింది తానేనన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఇప్పటికీ తనపై అభిమానం ఉందన్నారు. నిన్న, మొన్న రాజకీయాల్లోకి వచ్చిన వారి మాటలు నమ్మొద్దని ప్రజలకు సూచించారు.
నాపై ప్రజలకు అభిమానం ఇంకా ఉంది.. కాంగ్రెస్‌దే విజయం: జానా
Last Updated : Dec 23, 2020, 10:15 PM IST