తెలంగాణ

telangana

ETV Bharat / state

సెల్ టవర్ ఎక్కి యువకుడి హల్ చల్ - nalgonada district news

తనపై పోలీసులు అక్రమంగా కేసు పెట్టారని ఆరోపిస్తూ... ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో చోటుచేసుకుంది.

సెల్ టవర్ ఎక్కి యువకుడి హల్ చల్
సెల్ టవర్ ఎక్కి యువకుడి హల్ చల్

By

Published : Jul 26, 2020, 3:05 PM IST

సెల్ టవర్ ఎక్కి ఆత్యహత్య చేసుకుంటానని ఓ వ్యక్తి హల్ చల్ చేసిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. నరసింహపురానికి చెందిన వేణు మునగాల పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని గంటసేపు హల్ చల్ చేశాడు. అన్నదమ్ముల మధ్య నెలకొన్న భూవివాదంలో పోలీసులు తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని... అందుకే చనిపోవడానికి యత్నించినట్లు బాధితుడు పేర్కొన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన టవర్ వద్దకు చేరుకొని వేణుని కిందికి దించారు.

ABOUT THE AUTHOR

...view details