తెలంగాణ

telangana

ETV Bharat / state

గులాబీ గూటికి కాంగ్రెస్​ ఎమ్మెల్యే చిరుమర్తి..! - PINK COLOUR KANDUVA

తెరాస ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ మెుదలు పెట్టింది. ఈనెల 12న శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నందున సభ్యుల మద్దతు సేకరించే పనిలో నిమగ్నమైంది. నకిరేకల్ కాంగ్రెస్ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య తెరాస తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధపడుతున్నారు.

గులాబీ గూటికి చిరుమర్తి

By

Published : Mar 9, 2019, 7:39 AM IST

పార్లమెంట్,మండలి ఎన్నికల ముంగిట్లో కాంగ్రెస్​కు మరో ఎదురు దెబ్బ తగిలింది. చిరుమర్తి గులాబీకండువా వేసుకునేందుకు ఆసక్తి చూపించగా సీఎం ఆమోదించినట్లు సమాచారం. ఇప్పటికే పినపాకఎమ్మెల్యేరేగాకాంతారావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కులు తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత మరికొంత మంది పేర్లు తెర మీదకు వచ్చాయి.

తెరాస ఆహ్వానం:

ఈ నెల 2న టీపీసీసీ అధ్యక్షుడు శాసనసభ్యులకు ఏర్పాటు చేసిన విందుకు చిరుమర్తి గైర్హాజరు కావటంతో ఆయనపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. మండలి ఎన్నికల కోసం ఈనెల 10న తెరాస ఎమ్మెల్యేలతో పార్టీ అధిష్ఠానం సమావేశం ఏర్పాటు చేస్తోంది. ఈ సమావేశానికి సండ్ర వెంకట వీరయ్య, కాంతారావు, ఆత్రం సక్కులతో పాటు లింగయ్యలను తెరాస ఆహ్వానించినట్లు సమాచారం.

ఇవీ చూడండి:నేడు నాగర్​కర్నూల్​, చేవెళ్లలో కేటీఆర్​ సభలు

ABOUT THE AUTHOR

...view details