కాంగ్రెస్ హయాంలో ఎడారిగా మారిన నల్గొండ జిల్లా... ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కృష్ణ, గోదావరి జలాలతో సస్యశ్యామలం అయ్యిందని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. 60ఏళ్లుగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు కాంగ్రెస్ చేసిన నష్టమెంటో... తాము చేసిన అభివృద్ధి ఏంటో జానారెడ్డితో చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. 60 ఏళ్లుగా ఉన్న ప్లొరిన్‌ను 6 ఏళ్లలో తరిమి కొట్టడం జరిగిందని తెలిపారు. తిప్పర్తి మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో నూతన వ్యవసాయ పద్ధతులపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యమ్రానికి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు.
కేసీఆర్ సంకల్పంతో నల్గొండ సస్యశ్యామలం: జగదీశ్‌రెడ్డి - Nalgonda district latest news
కాంగ్రెస్ హయాంలో ఎడారిగా మారిన నల్గొండ జిల్లాను ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణ, గోదావరి జలాలతో సస్యశ్యామలం చేశారని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో లబ్ధిపొందిన తొలి జిల్లా నల్గొండ అని పేర్కొన్నారు. 60 ఏళ్లుగా ఉన్న ప్లొరిన్‌ను ఆరేళ్లలో తరిమికొట్టామని చెప్పారు.
'ఎడారిగా మారిన నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్‌దే'
రైతులను సంఘటితం చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం నెరవేరుతుందని జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. రైతులను చైతన్యం పరచలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యం మని... ఆదిశలోనే రైతులు వెళ్ళడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
ఇదీ చదవండి:'గ్రెటా, రిహానా మద్దతిస్తే తప్పేంటి?'